News March 31, 2025
పాలమూరు: ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు కలిశారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రంజాన్ పండుగా సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీజేపీ నేత నాగురావు నామాజీలు రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News April 2, 2025
పీటీఎం: పొరపాటున పురుగుమందు తాగిన రైతు

ఓ రైతు పొరపాటున పురుగు మందు కలిపిన నీళ్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. పీటీఎం మండలం గుగ్గిలోళ్లపల్లికు చెందిన రైతు మధుకర్ రెడ్డి(45) తన వ్యవసాయ పొలంలో ఉన్న పత్తి పంటకు పొద్దున్నుంచి పంట క్రాసింగ్ చేశాడు. మధ్యాహ్నం దాహం వేయడంతో పత్తి చెట్లకు కొట్టడానికి కలిపిన పురుగు మందు నీళ్లు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మదనపల్లికి తరలించి చికిత్స తరలించారు.
News April 2, 2025
వీరఘట్టం: ఎండ తీవ్రతకు వృద్ధురాలి మృతి

వీరఘట్టం మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధికి చెందిన మంతిని గౌరమ్మ (85) మంగళవారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌరమ్మ ఎండ తీవ్రతను తాళలేక మరణించిందని స్థానికులు తెలిపారు. అయితే ఉదయం పెన్షన్ తీసుకున్న కొద్దిసేపటికి మృతి చెందింది. చుట్టాలు, బంధువులు ఎవరు లేకపోవడంతో వీధిలో ఉన్న వారంతా వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.