News August 29, 2025
పాలమూరు: ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమావేశం

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.
Similar News
News August 30, 2025
యూరియా కొరత లేకుండా చూడండి: మహబూబ్‌నగర్ కలెక్టర్

ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఎరువులను విక్రయించే డీలర్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, వాటిని పక్కదారి మళ్లించకుండా రైతులందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎరువుల స్టాక్ ఉండి లేదని చెప్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
News August 30, 2025
ఎరువులని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు: MBNR కలెక్టర్

రైతులకు ఎరువులను అందించకుండా వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాల్లో ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులకు ఎరువులు లేవని చెబుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News August 29, 2025
MBNR: పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.