News February 17, 2026

పాలమూరు: కాంగ్రెస్ ఖాతాలోకి 17 ఛైర్మన్, 1 మేయర్

image

ఉమ్మడి పాలమూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/ మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (INC) 17 ఛైర్మన్, 1 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 2 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFB(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లకు చెరొకటి ఛైర్మన్ స్థానాలు దక్కాయి.

Similar News

News February 17, 2026

రఫేల్‌వైపే భారత్ ఆసక్తి ఎందుకు?

image

IAFను పటిష్ఠం చేసుకునేందుకు భారత్ 114 రఫేల్ విమానాల కొనుగోలు, లోకల్‌గా తయారీపై ఫోకస్ పెట్టింది. రష్యాకు చెందిన SU-57, USకు చెందిన F-35ను పక్కనపెట్టి రఫేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. రఫేల్‌లో థర్ట్‌పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్ డేటా ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం ఉండటం, మెయింటైన్ సులభంగా ఉండటం, వీటి కొనుగోలుతో ఎలాంటి రాజకీయ సవాళ్లు రాకపోవడం వల్ల భారత్ దీనికి ప్రాధాన్యం ఇస్తోంది.

News February 17, 2026

కర్తరీలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు?

image

కర్తరీలో ఎండలుంటాయి. బయట పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉండదు. అందుకే గృహ నిర్మాణం, శంకుస్థాపన, చెట్లు నరకడం, బావులు తవ్వడం పనులు నిషేధించారు. విపరీత వేడి వల్ల సిమెంట్, సున్నం వంటి నిర్మాణ సామాగ్రి పగుళ్లిచ్చే అవకాశముంటుంది. చెట్లు నరికితే తిరిగి చిగురించవు. శుభకార్యాలకు వచ్చే అతిథులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రకృతిని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాస్త్రాలు ఈ నియమాలు వచ్చాయి.

News February 17, 2026

IARIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ICAR<<>>-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IARI) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG(సాయిల్ సైన్స్/సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ అగ్రికల్చరల్ కెమికల్స్), డిగ్రీ, ఇంటర్ అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in