News December 23, 2025

పాలమూరు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త బి.నాగమణి మాల తెలిపారు. జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 27, 2025

క్యాబేజీ సాగు – యాజమాన్య పద్ధతులు

image

శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. వీటిలో దీర్ఘకాలిక రకాలను డిసెంబరు నెలాఖరు వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్‌ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.

News December 27, 2025

శివాజీపై పోరాటం.. అనసూయకు ప్రకాశ్ రాజ్ మద్దతు

image

కొన్నిరోజులుగా శివాజీ-<<18671913>>అనసూయ<<>> మధ్య SM వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సంస్కారులమని చెప్పుకునే వారిని మొరగనివ్వు. అది వాళ్ల కుంచిత మనస్తత్వం. మేమంతా నీతోనే ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. MLC <<18683153>>నాగబాబు<<>> కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. ‘మా బాబుగారు ఎప్పుడూ మావైపే’ అంటూ అనసూయ థాంక్స్ చెప్పారు.

News December 27, 2025

గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన!

image

AP: ఎక్కడికి వెళ్తారో.. ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తీరు. ఇటీవల కలెక్టర్ల భేటీలో CM దీనిపై సీరియస్ అవడంతో అధికారులు ప్రక్షాళన చేపట్టారు. ఇతర శాఖలకు డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇకపై సిబ్బంది రోజూ ఆఫీసుకు హాజరవ్వాలి. ఏ పని అయినా పై అధికారి ముందస్తు అనుమతితో బయటకు వెళ్లాలి. అక్కడి నుంచే యాప్‌లో హాజరు వేయాలి. పర్యవేక్షణకు వివిధ స్థాయుల అధికారుల్ని నియమిస్తున్నారు.