News April 3, 2025
పాలమూరు: ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పాలమూరు కురుమ సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. గొర్రె కాపర్ల సామాజికవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. మాదారం కృష్ణ, ఎస్.వెంకటేశ్, కొల్లంపల్లి శ్రీనివాస్, రామచందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూం వద్ద అరగంట సేపు ఆపి వీడియోలు తీసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 4, 2025
చరిత్ర సృష్టించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చరిత్ర సృష్టించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టు PBKS-21, RCB-20, SRHపై 20 విజయాలు సాధించింది. నిన్న SRHతో జరిగిన మ్యాచులో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. కాగా సన్‌రైజర్స్‌పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.