News January 6, 2026

పాలమూరు: జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

image

మెడికో లావణ్య ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆమె <<18765417>>ఆత్మహత్య <<>>చేసుకున్నట్లు విచారణలో తేలింది. సిద్దిపేటలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రణయ్ తేజ్‌తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ప్రణయ్ పెళ్లికి నో చెప్పడంతో నిర్ణయం తీసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల(D) మానవపాడు మండలం జల్లాపురానికి చెందిన లావణ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News January 8, 2026

Official: ‘జన నాయగన్‌’ విడుదల వాయిదా

image

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.