News October 16, 2025

పాలమూరు: టీబీ ముక్త్ భారత్ కోసం సమన్వయంతో పని చేయాలి: గవర్నర్

image

టీబీ ముక్త్ భారత్ కోసం అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీ నివారణ కోసం అవసరమైన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. టీబీ అనే మహమ్మారిని పారద్రోలేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక అవగాహనతో ఈ రుగ్మత నివారణ సాధ్యమన్నారు.

Similar News

News October 17, 2025

విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

image

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 17, 2025

అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

image

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.