News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

Similar News

News February 28, 2026

SVU: పీజీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ (PG) రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ /అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News February 28, 2026

KMR: జాతీయ స్థాయికి ఉపాధ్యాయుల నామినేట్

image

స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) జాతీయ సర్వేలో జిల్లా నుంచి జాతీయ స్థాయికి నామినేట్ అయిన TSNR ZPHS బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రవీంద్రారెడ్డి, ప్రభాకర్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అభినందించారు. జాతీయ స్థాయిలో పురస్కారాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO రాజు, MEO అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 28, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.