News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News November 8, 2025
రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ‘రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.
News November 8, 2025
MBNR: ‘ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోండి’

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 13 వరకు లేడీస్ టైలరింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
News November 8, 2025
ఆముదం పంటలో రసం పీల్చే పురుగుల నివారణ

యాసంగిలో ఆముదం పంటను రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఆకుల నుంచి రసం పీల్చడంతో ఆకుల కొనలు పసుపు వర్ణంలోకి మారి, మాడిపోతాయి. ఈ పురుగుల ఉద్ధృతి నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు పురుగుల ఉద్ధృతిని బట్టి లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పంటపై పిచికారీ చేయాలి.


