News January 2, 2026

పాలమూరు: నకిలీ కారం కలకలం

image

నకిలీ కారంపొడి కలకలం సృష్టించిన ఘటన బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొత్త సంవత్సర సందర్భంగా వంటకాలకు గ్రామంలో ఓ కిరాణా షాపులో కొందరు వ్యక్తులు కారంపొడి కొన్నారు. తమ వంటకాలలో వేయగా.. రంగు తప్ప రుచి లేకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. కారంపొడి నకిలీదని తేలింది. షాప్ యజమానిని నకిలీ కారంపొడిపై అడిగితే స్పందించలేదని గ్రామస్థులు అన్నారు.

Similar News

News January 2, 2026

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ రోహిత్ రాజు

image

కొత్తగూడెం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జనవరి 1 నుండి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు సబ్ డివిజన్లలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగించాలని ఆదేశించారు.

News January 2, 2026

సూర్యాపేట: రాజకీయ కక్షలతో వేధిస్తున్నారు: మత్స్యకారులు

image

మూడు దశాబ్దాలుగా చింతపాలెం మండలం పులిచింతల నదిని నమ్ముకుని జీవిస్తున్న తమను ఆంధ్రకు వెళ్లాలంటూ వేధిస్తున్నారని రేబల్లె మత్స్యకారులు కలెక్టరేట్‌లో మొరపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొందరు కుట్రపూరితంగా తమ లైసెన్సులపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టవద్దని, అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News January 2, 2026

జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

image

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.