News September 17, 2025

పాలమూరు నిరుద్యోగులకు జాబ్ మేళా

image

మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగుల కోసం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పాసైన 18 నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళా వివరాల కోసం 93981 72724, 63648 67804, 63648 63213 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
SHARE IT

Similar News

News September 17, 2025

తిరుగుబాటుకు తొలి అడుగు వీర బైరాన్‌పల్లి

image

రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, తిరుగుబాటును ప్రారంభించిన తొలి గ్రామం వీర బైరాన్‌పల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణలో ఇంకా పోరాటం కొనసాగుతున్న ఆ సమయంలో.. పొరుగు గ్రామాలను దోచుకెళుతున్న రజాకార్లను ధైర్యంగా అడ్డుకుంది. 126 మంది వీరుల త్యాగానికి నిదర్శనంగా ఉన్న అమరవీరుల స్తూపం ఇక్కడ నెలకొంది.

News September 17, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 17, 2025

‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్‌కు నష్టమా?

image

ఖతర్‌‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్‌‌కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.