News April 13, 2024

పాలమూరు నుంచి ఎన్నికైన ఉత్తమ పార్లమెంటేరియన్

image

మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో పోటీ చేసిన సూదిని జైపాల్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 1998లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున మహబూబ్‌‌నగర్ ఎంపీగా రెండో సారి ఆయన ఎన్నికయ్యారు. అదే ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీ జైపాల్ రెడ్డి కావడం విశేషం. పలు మార్లు కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.

Similar News

News October 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా రేవల్లిలో 31.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 24.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కృష్ణలో 13.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 11, 2024

MBNR: DSCలో 967 పోస్టుల భర్తీ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.

News October 11, 2024

వనపర్తి: అత్యాచారం.. ఆపై హత్య

image

గోపాల్‌పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్‌లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.