News January 24, 2025

పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

image

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 16, 2025

ఉద్యాన తోటల్లో రాగి లోప లక్షణాలు – నివారణ

image

రాగి లోపం వల్ల కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. ఆకులు కిందకు వంగిపోతాయి. కాండము, కాయలు, ఆకులపై ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడతాయి. బొడిపెల్లాంటి మచ్చలు ఏర్పడి కాయల పరిమాణం తగ్గుతుంది. కాయల మధ్య బంక ఏర్పడుతుంది. కొమ్మల పైనుంచి కూడా బంక కారవచ్చు. రాగిధాతు నివారణ మందులను పిచికారీ చేసి.. కొన్ని శిలీంద్రాల ద్వారా వచ్చే తెగుళ్లతో పాటు పంటల్లో రాగిధాతు లోపాన్ని కూడా అరికట్టవచ్చు.

News September 16, 2025

ఉమ్మడి చిత్తూరు: డీఎస్సీలో 70 మిగులు సీట్లు

image

డీఎస్సీ-2025లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 1,478 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 1,408 మంది ఎంపికయ్యారు. 70 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.

News September 16, 2025

ఇంటర్ కాలేజీల ఎంప్లాయిస్‌కు ఆన్లైన్ సేవలు..!

image

ప్రభుత్వ ఇంటర్ కాలాశాలల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. వీరికోసం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం అనే పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎంప్లాయిస్ లీవ్స్, NOC, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇంక్రిమెంట్స్, సర్వీస్ హిస్టరీ, పెన్షన్ వంటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఉమ్మడి KNRలో 53 ఇంటర్ కాలేజీలు ఉండగా, ఇందులో 1100 మందివరకు లెక్చరర్స్‌తోపాటు సిబ్బంది ఉన్నారు.