News September 6, 2025

పాలమూరు: నేడు ZPTC, MPTC ముసాయిదా ఓటరు జాబితా

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు ZPTC, MPTC ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు 77 కాగా, ఎంపీటీసీలు 800 ఉన్నాయి. వీటిపై ఈనెల 8న సమావేశాలు నిర్వహిస్తారు. 9న అభ్యంతరాలను స్వీకరణ, పరిష్కారం అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు.

Similar News

News September 6, 2025

దంపతుల గుండె పగిలేలా చేసిన ప్రమాదం

image

ఒక్కగానొక్క బిడ్డ. మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో <<17627461>>అల్లారుముద్దుగా<<>> పెంచుకున్నారు. కష్టం దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడుతుకున్నారు. కానీ విధి వారి ఆశల్ని చిధిమేసింది. సూళ్లూరుపేట(M) అబాక హరిజనవాడలో రోటవేటర్‌లో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. కృష్ణయ్య చిన్న కుమారుడు, కోడలికి దివాన్(3) ఒక్కడే బిడ్డ. ఆ పిల్లాడి మృతితో దంపతులు గుండెలు పగిలేలా విలపించారు.

News September 6, 2025

KNR: ‘రాగిజావ’ పథకం ఉన్నట్టా..? లేనట్టా..?

image

గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో రాగిజావ స్కీంను తెచ్చారు. రెండేళ్లుగా సాఫీగా సాగిన పథకం స్కూళ్లు ప్రారంభమై 3నెలలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, ప్రభుత్వం ఈ స్కీంను సాగిస్తోంది. 10గ్రా. బెల్లం, 10గ్రా. రాగిపిండితో జావ ఇచ్చేందుకు ఒక్క విద్యార్థికి 25పైసల చొప్పున ఏజెన్సీకిచ్చేవారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడీ పథకముందా, రద్దయిందా అనే సంకట స్థితి నెలకొంది.

News September 6, 2025

అమరావతి: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కన్నా

image

అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సమీపంలో ఉన్న టీటీడీ దేవస్థానంలో వేంకటేశ్వరస్వామిని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కన్నాకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు ఎమ్మెల్యేకు అందజేశారు. అమరావతిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కన్నా అన్నారు.