News February 17, 2026
పాలమూరు: ‘నేడే లాస్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకోండి’

నూతన బడ్జెట్‌పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ప్రతిభకనబరిచిన యువత జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానమంత్రితో సంభాషించే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, అర్హత గల యువత ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Site:https://mybharat.gov.in
Similar News
News February 21, 2026
YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారు: యూత్ కాంగ్రెస్

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు దేశాన్ని కించపరిచేలా ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాల కంటే దేశ ప్రతిష్ఠ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై యూత్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారని, CID/ED కేసుల భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదిలేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
News February 21, 2026
మొదటి స్థానంలో స్టేషన్ ఘనపూర్: కడియం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 85 శాతం ప్రారంభించి, ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం శ్రీపతిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మరో 3,500 ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయన్నారు.
News February 21, 2026
AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.


