News April 5, 2025

పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.

Similar News

News April 6, 2025

రోడ్డు ప్రమాదంలో ASI మృతి

image

రోడ్డు ప్రమాదంలో ASI మృతి చెందిన ఘటన శనివారం పుత్తూరు(మ) వేపగుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వేపగుంటకు చెందిన రఘుకుమార్ తిరుపతి MRపల్లెలో ఆర్ముడు రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకుని బస్సులో వస్తూ వేపగుంట వద్ద దిగాడు. అక్కడ రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.  

News April 6, 2025

HNK: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన రాజీవ్(32) గవిచర్ల రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కాశికుండకు చెందిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 2 ఫోన్‌లు, రూ.1500 స్వాధీనం చేసుకున్నారు.

News April 6, 2025

న్యూస్ రౌండప్

image

* AP: అనకాపల్లి ఫార్మా సిటీలో ప్రమాదం.. విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
* తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. స్వామిని దర్శించుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా
* TG: శ్రీశైలం SLBCలో 43 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ
* శ్రీరామనవమి వేళ అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీ

error: Content is protected !!