News April 5, 2025
పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.
Similar News
News April 6, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. మార్కెట్లకు పరిగెడుతున్న అమెరికన్లు

ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో అన్ని వస్తువులపై రేట్లు పెరుగుతాయన్న ఆందోళన అమెరికావ్యాప్తంగా నెలకొంది. దీంతో జనాలు సూపర్ మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ దుకాణాల వరకూ పోటెత్తుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, బూట్లు, కార్లు, విదేశీ ఆహారాలు, విద్యుత్ పరికరాలు.. ఇలా అన్ని రకాల వస్తువులకూ భారీ డిమాండ్ నెలకొంది. ఏ షాపింగ్ మాల్ చూసినా జనం భారీగా కనిపిస్తున్నారు.
News April 6, 2025
సీతంపేట: ఆటో బోల్తా.. ఒకరి మృతి

సీతంపేట పరిధిలో ఇసుకగెడ్డ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వెలగవాడకి చెందిన గొట్టపు లక్ష్మణరావు (36) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వలనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సీతంపేట ఎస్ఐ అన్నంరావు కేసు నమోదు చేశారు.
News April 6, 2025
అమృతలూరు: విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

అమృతలూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాంబాబు(25) శనివారం రాత్రి ఇంటిలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. రాంబాబు రోజూ గుంటూరు పెయింటింగ్ పనికి వెళ్లి వస్తాడని, శనివారం ఇంటి దగ్గరే ఉండి కరెంట్ పనిచేస్తుండగా షాక్ కొట్టినట్లు తండ్రి సంసోను చెప్పారు. ఆ యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.