News December 18, 2025

పాలమూరు పంచాయతీ పోరు: కాంగ్రెస్‌ హవా

image

పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ముగిసిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 77 మండలాలలోని 1,678 సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధికంగా 964 చోట్ల విజయం సాధించారు. BRS బలపరిచిన అభ్యర్థులు 482స్థానాల్లో గెలవగా.. BJP 75 పీఠాలను దక్కించుకుంది. మరో 150చోట్ల స్వతంత్రులు, ఇతరులు విజేతలయ్యారు. మొత్తం 15,068 వార్డు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులే నెగ్గారు.

Similar News

News December 23, 2025

ఇష్టానుసారం ICU ఛార్జీల వసూళ్లు కుదరదు: కేంద్రం

image

ఎమర్జెన్సీ చికిత్స బాధ్యత కావాలని, ఆర్థిక దోపిడీకి ఆసరాగా చూడొద్దని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కేంద్రం సూచించింది. వెంటిలేటర్, ICU ఛార్జీలను పబ్లిక్‌గా డిస్‌ప్లే చేయాలని చెప్పింది. ఆక్సిజన్/వెంటిలేటర్‌ వాడిన సమయానికి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. 2024లో వెంటిలేటర్ పరిశ్రమ మార్కెట్ విలువ 207 మిలియన్ USDగా రికార్డైంది. భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News December 23, 2025

అరటి సాగుకు అనువైన రకాలు

image

అరటి ఉత్పత్తిలో దేశంలోనే AP తొలిస్థానంలో ఉంది. ఈ పంట సాగుకు సారవంతమైన తగిన నీటి వసతి కలిగిన భూమి అనుకూలం. అలాగే నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగిన సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలం. పండ్ల కోసం కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, గ్రాండ్‌నైన్, పొట్టి పచ్చ అరటి.. కూర కోసం కొవ్వూరు బొంత, గోదావరి బొంత రకాలు అనుకూలం. తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, బొంత రకాలను ఏడాది పొడవునా నాటవచ్చు.

News December 23, 2025

‘శివాజీ డర్టీ గాయ్’.. RGV ఘాటు వ్యాఖ్యలు

image

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు <<18646239>>శివాజీ <<>>చేసిన వ్యాఖ్యలకు సంబంధించి RGV ఘాటుగా స్పందించారు. ‘నాకు అతని పూర్తి పేరు తెలీదు. హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్‌ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు. సొసైటీలోని మిగతా మహిళలు, ఇండస్ట్రీలోని వాళ్లు, ఇంకా ఎవరైనా కావొచ్చు.. వారి విషయంలో నీ నిర్ణయాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకో’ అని ట్వీట్ చేశారు.