News February 18, 2026

పాలమూరు: పెళ్లిళ్ల సీజన్.. RTC గుడ్‌న్యూస్

image

ఫాల్గుణ మాసం నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఈనెల 18 నుంచి అద్దెకు ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7/- భారీ తగ్గింపు, 6 గంటల వెయిటింగ్ ఛార్జి మినహాయింపు ఉంటుందని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు చేసుకోవాలని కోరారు.
SHARE IT

Similar News

News February 18, 2026

ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

image

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.

News February 18, 2026

స్నాక్స్ లాగించేస్తున్నారా?

image

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

News February 18, 2026

భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష!

image

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సరికొత్త క్రిమినల్ కోడ్‌ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే మహిళలకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దు. చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.