News October 18, 2025

పాలమూరు: ప్రశాంతంగా కొనసాగుతున్న బీసీ బంద్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి బీసీ JAC నాయకులు డీపోల వద్ద నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల్లోని బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. BC బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Similar News

News October 18, 2025

జయశంకర్ జిల్లాలో 1055 మద్యం టెండర్లకు దాఖలు

image

భూపాలపల్లి జిల్లాలో మద్యం శనివారం సాయంత్రం మద్యం టెండర్లు దాఖలు ముగిశాయి. జయశంకర్, ములుగు జిల్లాలకు 59 షాపులు ఉండగా.. 1055 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు రూ.3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజులను చెల్లించారు. గతేడాది 59 మద్యం షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే సగం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

News October 18, 2025

ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన స.హ.చ కమిషనర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ అనుదీప్‌ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్‌తో చర్చించారు.

News October 18, 2025

సోలార్ యూనిట్లు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం మాట్లాడుతూ.. దీపావళి రోజు వాతావరణం కలుషితం చెయ్యని క్రాకర్స్‌ను మాత్రమే వెలిగించాలని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చెయ్యాలని కోరారు.