News January 3, 2026
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఉద్యమం: జాన్ వెస్లీ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 32 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 74 వేల కోట్లు అని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
Similar News
News January 8, 2026
జుట్టుకు ఈ జాగ్రత్తలు

అందంగా కనిపించాలని చేసే స్టైలింగ్ పద్ధతుల ప్రభావం జుట్టుపై పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక పదిరోజుల ముందు నుంచే డ్రయ్యర్లకు, గాఢత ఎక్కువ ఉన్న షాంపూలు వాడొద్దు. స్ట్రెయిటనింగ్, కర్లింగ్ చేయించుకోవడం, జెల్, స్ప్రేల వాడకానికి దూరంగా ఉండండి. ఇవన్నీ జుట్టుని బరకగా మారుస్తాయి. మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అలాగే ఇలాంటి వేడుకలు, ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు కొత్త ఉత్పత్తులతో ప్రయోగాలు చెయ్యకూడదు.
News January 8, 2026
సూళ్లూరుపేట: పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్!

సూళ్లూరుపేట :ఫ్లెమింగో పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేలపట్టు, పులికాట్‌లో సందడి చేస్తున్నాయి. పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. 2016లో పర్యాటక శాఖ రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించింది.
News January 8, 2026
MBNR: పీఎంశ్రీ.. 800 క్రీడాకారులు హాజరు

పీఎంశ్రీ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు మహబూబ్‌నగర్‌లో రెండో రోజు ఘనంగా నిర్వహించారు. మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో బాలికలు, బాలురు విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


