News April 15, 2025

పాలమూరు: మత్తు మందు ఇచ్చి.. బాలికపై అత్యాచార యత్నం!

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News December 19, 2025

ఎన్నికల్లో పోటీ చేశారా? ఇలా చేయకుంటే చర్యలు తప్పవు!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చు నివేదికలను ఎంపీడీవోలకు సమర్పించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సకాలంలో అందజేయకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బరిలో నిలిచినవారు వివరాలు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది.

News December 19, 2025

అధిక పోషక విలువల మాంసం.. కడక్‌నాథ్ సొంతం

image

అత్యంత పోషక విలువల కలిగిన మాంసానికి కడక్‌నాథ్ కోళ్లు ప్రసిద్ధిచెందాయి. వీటి చర్మం, మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్‌గా పిలుస్తారు. నాటుకోడితో పోలిస్తే ఈ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఈ కోళ్లు 6 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏటా 100 నుంచి 110 గ్రుడ్లను మాత్రమే పెడతాయి. వీటి గుడ్లకు, మాంసానికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది.

News December 19, 2025

శ్రీవారిని దగ్గర నుంచి చూడాలంటే?

image

సాధారణ భక్తులు 70 అడుగుల దూరం నుంచి స్వామిని చూస్తే, లక్కీడిప్‌లో ఎంపికైన వారు 9 అడుగుల దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. అందుకే మీరు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ నేరుగా ‘ఆఫ్‌లైన్ లక్కీడిప్’లో నమోదు చేసుకుంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు డొనేట్ చేయడం వల్ల కూడా మొదటి గడప దర్శన భాగ్యం లభిస్తుంది.