News October 16, 2025
పాలమూరు: మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి గద్వాల జిల్లాలో ఉన్న బాలబాలికల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TGSWRS జిల్లా సమన్వయ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈనెల 18వ తేదీన సాయంత్రం 05 గంటల లోపు ఎర్రవల్లిలోని TGSWRS, DCO కు సమర్పించాలని సూచించారు.
Similar News
News October 16, 2025
రాయితీపై రైతులకు వ్యవసాయ పనిముట్లు

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా SMAM-2025 స్కీములో భాగంగా జిల్లాలోని రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా చిన్న, సన్నకారు రైతులకు 50% సబ్సిడీ, మిగతా రైతులకు 40% సబ్సిడీ ఉంటుందన్నారు. బ్యాటరీ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, రోటవేటర్, కల్టివేటర్, ప్లవు, పవర్ టిల్లర్ కొరకు రైతులు మండల వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 16, 2025
‘పెద్దపల్లిలో 24 గంటల వైద్య సేవలు’

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం సందర్శించారు. 24 గంటల ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆసుపత్రి సామర్థ్యం 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు చేయబడిందన్నారు. ప్రతి రోజు వేర్వేరు రంగుల బెడ్‌షీట్‌ల వినియోగాన్ని ప్రారంభించారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు, MRI, CT వంటి పరికరాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
News October 16, 2025
నా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది: MLA కోమటిరెడ్డి

నేను జన్మతః కాంగ్రెస్ పార్టీ వాడిని, నారక్తంలోనే కాంగ్రెస్ ఉంది, పార్టీలోనే ఉంటానని MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. DCC అధ్యక్షుడి ఎంపికపై మునుగోడులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్తులు అమ్ముకొని కష్టకాలంలో పార్టీని బతికించడానికి పనిచేశాన్నారు. దశాబ్దాలుగా మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో AICC మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మొహంతి పాల్గొన్నారు.