News November 30, 2024
పాలమూరు ముద్దుబిడ్డ సీఎం కావడం మన అదృష్టం: జూపల్లి

పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి సీఎం కావడం మన అదృష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ పనులు మొత్తం పూర్తి చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Similar News
News February 20, 2026
MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.
News February 20, 2026
MBNR: ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్‌ఎల్‌ఎన్/ ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని డీఈవో సూచించారు.
News February 19, 2026
MBNR: ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వేళల్లో సడలింపు

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని PU విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనివేళల్లో సడలింపు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులందరూ సాయంత్రం ప్రార్థన (నమాజ్) చేసుకోవడానికి వీలుగా ప్రతిరోజూ గంట ముందుగా (సా. 04:00 గంటలకు) యూనివర్సిటీ నుంచి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేశామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.


