News February 6, 2026
పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు

గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, BRS మధ్యనే సాగింది. కానీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారి బీజేపీ సైతం బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో మునిసిపల్ ఎన్నికలలో త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది. ఏ డివిజన్, వార్డులలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News February 7, 2026
కొత్తకోట బరిలో భార్యాభర్తలు

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ 10వ వార్డు నుంచి అడ్వకేట్ యాదగిరి పోటీ పడుతుండగా, 11వ వార్డు నుంచి ఆయన భార్య శ్రీలత బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పదవిని దక్కించుకోవాలని శ్రీలత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ దంపతుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది.
News February 7, 2026
‘హగ్స్, ఫొటో సెషన్స్ పని చేయలేదు’.. ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ సెటైర్లు

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘ఇకపై రష్యా ఆయిల్‌ను ఇండియా కొనదు. కొంటే 25% పెనాల్టీ విధిస్తామని US హెచ్చరించింది. US రైతుల కోసం దిగుమతి సుంకాలను ఇండియా తగ్గిస్తుంది. అమెరికా ఎక్స్‌పోర్ట్స్ 3 రెట్లు పెరుగుతాయి. భారత వస్తువులపై ఎక్కువ సుంకాలు పడతాయి. హగ్స్, ఫొటో సెషన్స్ పెద్దగా పని చేయలేదు. హౌడీ మోదీపై నమస్తే ట్రంప్‌దే పైచేయి’ అని జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


