News January 5, 2026

పాలమూరు: మున్సిపల్ ఎన్నికల వేళ.. నేతల ఆశలు

image

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కసరత్తు ముమ్మరం కావడంతో ఆశావహులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నాయకులు సంక్రాంతి తర్వాత చూద్దామని చెబుతుండగా, ఆశావహులు మాత్రం డివిజన్లలో రహస్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.

Similar News

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. ఆటకానితిప్పలో పక్షుల విన్యాసాలు!

image

సూళ్లూరుపేట- శ్రీహరికోట దారిలోని ఆటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సులో వలస పక్షుల వేట విన్యాసాలు పక్షి ప్రేమకులను కట్టిపడేస్తాయి. సూళ్లూరుపేట నుంచి సూమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల విజ్ఞాన కేంద్రం ఆకట్టుకుంటుంది.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇరకం దీవిలో ఇదే స్పెషల్!

image

పులికాట్ సరస్సుకు మధ్యలో ఉండే ఇరకం దీవికి వెళ్లాలంటే 8 KM పడవ ప్రయాణం చేయాలి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ ఉప్పునీరున్నా.. ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత.

News January 10, 2026

వారికి సిద్దిపేట సీపీ వార్నింగ్

image

చైనా మాంజా(నైలాన్ దారం) వాడినా, అమ్మినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. ఈ మాంజా వల్ల వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధించిందని తెలిపారు. పండుగ పూట ప్రమాదాలకు తావులేకుండా ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.