News March 2, 2026
పాలమూరు: మోడల్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మోడల్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ అకాడమీల 5వ తరగతి ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్ తెలిపారు. 31-08-2026 నాటికి 9-11 ఏళ్లు వయస్సు ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారు అర్హులు. ఈనెల 12 దరఖాస్తు చివరి తేదీ, 13న MBNR జిల్లా క్రీడా ప్రాంగణంలో ఎంపికలు నిర్వహించబడతాయి.
Similar News
News March 2, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.
News March 2, 2026
అన్నమయ్య: కరెంట్ సమస్యలు ఉంటే కాల్ చేయండి!

అన్నమయ్య జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి APSPDCL సీఎండీ శివశంకర్ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. వినియోగదారులు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
ASF: నైపుణ్యాలున్నా.. ఉపాధ్యాయులు లేరే..!

జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. 11 జూనియర్ కాలేజీల్లో 4,625 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కచోట కూడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వం ప్రతి కళాశాలకు ఏటా రూ.10,000లను క్రీడా నిధులకు అందిస్తోంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలున్నా ఉపాధ్యాయుడు లేక చదువుకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పీడీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.


