News January 2, 2026
పాలమూరు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

బాలికను మోసం చేసి శారీరకంగా వాడుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శ్రీరంగాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి గురువారం PSలో ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 7, 2026
నిమ్మలో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

నిమ్మ చెట్లకు నీటి తడులలో ఒడిదుడుకులు, ఎక్కువ రోజుల పాటు నీటిని ఇవ్వకుండా ఒక్కసారిగా ఎక్కువ నీటిని ఇవ్వడం, చెట్టులో హార్మోనల్ స్థాయిల్లో మార్పులు, వాతావరణ మార్పుల వల్ల నిమ్మలో పూత, పిందె రాలే సమస్య తలెత్తుతుంది. దీని నివారణకు 200 లీటర్ల నీటికి 45-50ml ప్లానోఫిక్స్ మందును కలిపి పూత పూసే సమయంలో ఒకసారి, పిందె దశలో మరోసారి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 7, 2026
భర్త ప్రొడక్షన్‌లో సమంత సినిమా.. లుక్ రిలీజ్

రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. సామ్ లుక్ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా JAN 9న టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భర్త రాజ్‌తో పాటు సమంత కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
News January 7, 2026
వికారాబాద్‌లో ఎలక్షన్.. ఉత్కంఠ

పురపాలక ఎన్నికల కసరత్తు వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్ల సెగ మొదలైంది. జిల్లాలోని తాండూరు(36), వికారాబాద్(34), పరిగి(18), కొడంగల్(12) మున్సిపాలిటీల్లోని 100వార్డుల అభ్యర్థులు తమ స్థానం ఏ క్యాటగిరీకి కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.


