News March 27, 2025

పాలమూరు యూనివర్సిటీలో ఉగాది వేడుకలు ప్రారంభం

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని కాంశించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

image

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>

News November 14, 2025

ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

image

ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌‌లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్‌పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.

News November 14, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్‌లుగా పాఠశాల ప్రాంగణాలు