News October 18, 2024
పాలమూరు యూనివర్సిటీ VCగా శ్రీనివాస్ నియామకం

పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతి(VC)గా ప్రొఫెసర్ GN శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్.. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ OUలో పూర్తి చేశారు. ఆయన JNTU ప్రొఫెసర్‌గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేశారు. OUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, JNTU సుల్తాన్‌పూర్ ప్రిన్సిపల్‌గా పని చేశారు.
Similar News
News December 31, 2025
HYDపై పాలమూరు ఘన విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T-20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్ నగర్ జట్టు 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.MBNR జట్టుకు చెందిన క్రీడాకారులు అబ్దుల్ రపే-53* (4s-5,6s-1), డేవిడ్ కృపాల్ రాయ్-103* (4s-11,6s-6) పరుగులు చేశారు.ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు అభినందించారు.
News December 31, 2025
MBNR: GOOD NEWS.. వీరికి రూ.1,00,000

దివ్యాoగులను సకలాoగులు & దివ్యాంగులు, దివ్యాంగులను వివాహం చేసుకొనిన ప్రభుత్వం రూ.1,00,000/- ల వివాహ ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని వయోవృద్దుల సంక్షేమ శాఖసంక్షేమ అధికారిని యస్.జరీనా బేగం తెలిపారు. 19/05/2025 తరువాత వివాహం చేసుకున్న దంపతులు www.epass.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఫారంను సమగ్ర శిశు అభివృద్ధి ఆధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
News December 31, 2025
MBNR: ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు గడువును 3.3.2026 తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎస్సీడీ. డి. సునీత ఒక ప్రకటన తెలిపారు. వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


