News March 28, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాకిచ్చింది. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కోర్టు వివాదం నేపథ్యంలో తెలంగాణ పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది.
Similar News
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
News March 31, 2025
గొల్లప్రోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వీక్లి స్పెషల్ రైలు నుంచి విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన అనిల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు రైలులోని వాష్ బేసిన్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. సంఘటన ప్రాంతానికి తుని రైల్వే పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.