News February 17, 2026
పాలమూరు: రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల సడలింపు

రాష్ట్రంలోని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 4:00 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులు 19-02-2026 నుంచి 20-03-2026 వరకు అమలులో ఉంటాయి. అయితే, అత్యవసర సేవలలో ఉన్న సిబ్బందికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.
Similar News
News February 20, 2026
అమీర్‌పేటలో ప్రాణాలు కాపాడింది వీళ్లే!

మైత్రివనంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాన్ని హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చింది. రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైడ్రా కమిషనర్, అదనపు డైరెక్టర్, ఏడీఎఫ్‌వో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. ప్రాణాలు కాపాడిన సిబ్బందికి సెల్యూట్.
News February 20, 2026
ప.గో జిల్లాలో శ్రీకాకుళం వాసి మృతి

ప.గోజిల్లాలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భవనం నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్ రోడ్డు నంబర్ 13లో ఓ భవనంలో పనులు చేస్తున్న ముగ్గురి కార్మికులపై పరంజా విరిగి పడగా తీవ్ర గాయాలయ్యాయి. తోటివారు ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీకాకుళం(D) ఎచ్చెర్ల వాసి రాము(45) మృతి చెందాడు.
News February 20, 2026
మేడారం జాతరపై గాడెస్ ఆఫ్ ఫోక్ పుస్తకం ఆవిష్కరణ

మేడారం జాతరపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రచురించిన గాడెస్ ఆఫ్ ఫోక్ పుస్తకాన్ని మంత్రి సీతక్క హైదరాబాద్‌లోని ఫూలే ప్రజా భవన్‌లో విడుదల చేశారు. ప్రముఖ చిత్రనిర్మాత నర్సింగరావు అరుదైన చిత్రాలతో పుస్తకాన్ని సిద్ధం చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతరను UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు.


