News December 3, 2025
పాలమూరు: రెబల్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ కోసం పడరాని పాట్లు

పాలమూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెబల్ అభ్యర్థుల ఉపసంహరణ కోసం వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో నిలవడంతో, ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపసంహరణకు నేడే చివరి రోజు కావడంతో, రెబల్ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 3, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. అప్లయి చేసుకోండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీ కెమెరా కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, బ్యాంకు పాస్ బుక్, ఆధార్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
– SHARE IT.
News December 3, 2025
శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్‌లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
News December 3, 2025
కోర్టుకెక్కిన పేరూరు గ్రామ ‘పంచాయితీ’..!

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరులో ఎస్టీ మహిళ ఓటర్లు లేకున్నా గ్రామ సర్పంచ్, వార్డులు ఎస్టీ మహిళకి రిజర్వ్‌డ్ కావడంతో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు) ఉన్నారు. గ్రామ పంచాయతీలు 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్‌డ్ చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కోర్టుకెక్కింది.


