News September 22, 2025

పాలమూరు: రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు మృతి

image

<<17789391>>మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం<<>> చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బావ, మరదలు మృతి చెందారు. పాన్‌గల్(M) చిక్కేపల్లి వాసి రంజిత్ కుమార్ రెడ్డి(35), ఆయన భార్య చెల్లి హారిక(25) కారులో HYD వెళ్తున్నారు. ఈ క్రమంలో అటువైపు అతివేగంగా వస్తున్న మరో కారు డివైడర్‌ను ఢీకొట్టి రంజిత్, హారికలు ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో వారిద్దరూ స్పాట్‌లోనే మరణించారు.

Similar News

News September 22, 2025

తిరుపతి: ఈనెల 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి రాక

image

ఈనెల 24,25 తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయినట్లు తిరుపతి కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో ముందస్తు సెక్యూరిటీ ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఇతర విభాగాల అధికారులకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు.

News September 22, 2025

నవ దుర్గల అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక

image

శ్రీశైలంలో భ్రమరాంబికా దేవీ నవరాత్రుల్లో(SEP 22-OCT 2) నవ దుర్గల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ దుర్గాదేవిగా అనుగ్రహించారు. రేపటి నుంచి వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అలంకారాల్లో దర్శనమిస్తారు. SEP 30న మహా అష్టమి సందర్భంగా భ్రమరాంబికా అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఈ అలంకారాలు శ్రీశైలంలో మాత్రమే దర్శించుకోవచ్చు.

News September 22, 2025

శ్రీశైలం: నవ దుర్గల అలంకారాలు.. విశిష్టత

image

1. శైలపుత్రి: సతీదేవి అగ్నిలో దూకి ఆహుతి చేసుకున్న తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించారు. ఈమె త్రిశూలం, కమలంతో వృషభ వాహనంపై దర్శనమిస్తారు. శైలపుత్రి దర్శనం కల్యాణ యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
2. బ్రహ్మచారిణి: పార్వతీదేవి జపమాల, కమండలం ధరించి శివుడి కోసం తపస్సు చేసిన రూపం బ్రహ్మచారిణి. ఈమె స్వరూపాన్ని దర్శించి, పూజిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.