News January 1, 2026
పాలమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్‌డెడ్

MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లింబ్యా తండా గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు వస్పుల గ్రామానికి చెందిన మదన్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.
News January 2, 2026
పల్నాడు: కలెక్టర్ పిలుపునకు స్పందన.. 1,575 పుస్తకాల అందజేత

నరసరావుపేటలో కలెక్టర్ కృత్తికా శుక్లా వినూత్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో బొకేలు, శాలువాలకు బదులు పేద విద్యార్థుల కోసం పుస్తకాలు ఇవ్వాలని ఆమె కోరారు. దీనికి స్పందించిన అధికారులు, ప్రముఖులు మొత్తం 1,300 నోటు పుస్తకాలు, 275 పాఠ్యపుస్తకాలను కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ పుస్తకాలను త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
News January 2, 2026
మాటపై ఉంటారా? టికెట్ రేట్స్ పెంచుతారా?

TG: పుష్ప 2 విషాదం తర్వాత సినిమాల టికెట్ రేట్స్ పెంచమని CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పలు మూవీస్ రేట్ పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇటీవల అఖండ-2కు ధరలు పెంచగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తనకు తెలియకుండా అధికారులే ఆదేశాలిచ్చారని, ఇకపై ఇలా జరగదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలోని ‘రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు’లకూ ఇది వర్తిస్తుందా? చూడాలి.


