News April 30, 2024

పాలమూరు లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు.!

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న, మొన్నటి వరకు BJP, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి KCR పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి BJP, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

Similar News

News December 29, 2024

పాలమూరు టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లా టెట్ అభ్యర్థులకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వచ్చే నెల 2-20 మధ్య తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు సమర్పించే సమయంలో 16 కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఆధారంగా ఇచ్చిన జిల్లాలో కాకుండా చివరి ప్రాధాన్యతలో దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.

News December 29, 2024

MBNR: 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 9,41,395 రేషన్ కార్డులు ఉన్నాయి. డీలర్లు ప్రతి నెల 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అర్హత ఉన్నా లబ్ధిదారులు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-739, NGKL-573, GDWL-351, NRPT-301, WNPT-328 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుడికి ఆరు కిలోల బియ్యం మంజూరు చేస్తోంది.

News December 29, 2024

ఉపాధి హామీ పథకం.. నాగర్‌కర్నూల్ టాప్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,70,214 జాబ్ కార్డులు ఉన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో జాబ్ కార్డులు ఉన్నాయి. దాదాపు 20 లక్షల కూలీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పురుషుల కంటే మహిళలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సుమారుగా 3,000 పైగా కుటుంబాలు వందరోజుల పనులను పూర్తి చేసుకున్నారు.