News March 29, 2026
పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News March 29, 2026
MBNR: లోక్ అదాలత్.. 3,416 కేసుల పరిష్కారం

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారంలో విశేష ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరింనట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఈ విధమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
News March 28, 2026
పాలమూరు: అత్యవసర పరిస్థితుల్లో అపర సంజీవని 108 సేవలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 108 సేవలు ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 అంబులెన్సులు 108కు ఫోన్ చేసిన 15 నిమిషాల లోపల సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి Way2Newsతో తెలిపారు. మార్చి 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81,540 మందికి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించి ప్రాణపాయ స్థితి నుంచి కాపాడారు.
News March 28, 2026
MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!


