News March 28, 2025

పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

image

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.

Similar News

News March 31, 2025

వనపర్తి: కొడుకు మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. బుద్దారానికి చెందిన కోదండరాములు(55) కుమారుడు ఆంజనేయులు భార్యతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగా ఇటీవల ఇంట్లో ఉరేసుకున్నాడు. కోదండరాములు చిన్న కొడుకు సైతం ఏడాది క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 31, 2025

MBNR: రంజాన్‌కు భారీ బందోబస్తు: SP 

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ నేపథ్యంలో నేడు ఈద్గా, మసీద్‌లలో పెద్ద ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

News March 31, 2025

గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

image

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.

error: Content is protected !!