News March 28, 2025

పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

image

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.

Similar News

News July 6, 2025

NGKL: జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన- కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30కు మన్ననూర్ గృహవాని గెస్ట్ హౌస్‌కు చేరుకొని అక్కడే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అమ్రాబాద్ పీడబ్ల్యూ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News July 6, 2025

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

image

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News July 6, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కామారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.