News February 25, 2026
పాలమూరు: శ్రీరంగాపురం వెళ్తున్నారా?

వనపర్తి(D) శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి MBNR జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న ఈ గుడి అద్భుత శిల్ప కళతో భక్తులను కట్టిపడేస్తోంది. కాగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవనుండగా మార్చి 6 వరకు జరగనున్నాయి. SHARE IT
Similar News
News February 27, 2026
ఇజ్రాయెల్‌కు అమెరికా స్టెల్త్ విమానాలు

ఇరాన్‌తో అణు చర్చల వేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్‌డ్ F-22 రాప్టర్ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు పంపింది. బ్రిటన్ నుంచి బయలుదేరిన 12 విమానాలు ఇప్పటికే అక్కడ ల్యాండయ్యాయి. ఒకవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో చర్చలు సాగుతున్నా అమెరికా మాత్రం తన మిలిటరీ బలాన్ని పెంచుతూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్సామ్‌ను నిలువరించడమే లక్ష్యంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించింది.
News February 27, 2026
నేడు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ ట్రయల్ రన్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్థులు, ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.
News February 27, 2026
స్నేహ శబరీష్.. పాలనలో తనదైన ముద్ర!

HNK కలెక్టర్‌గా జూన్ 2025లో బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్ సుమారు 8 నెలల పాటు జిల్లాలో సేవలందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేశారు. మిషన్ ఎక్సలెన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రభుత్వ & గురుకుల విద్యార్థులు JEE, IIT సాధించేలా తన వంతు ప్రయత్నం చేశారు.


