News January 12, 2026
పాలమూరు: సంక్రాంతికి వెళ్తూ.. మృత్యువు ఒడికి..

సంక్రాంతి పండగకు కూతురి వద్దకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. <<18828834>>ఈ ఘటన<<>> నిన్న భూత్పూర్‌లోని హైవే-44పై జరిగిన విషయం తెలిసిందే. మృతుడు శేషయ్య విశ్రాంత సైనికుడు. పదేళ్ల నుంచి భార్య నవనీతమ్మతో కలిసి మేడ్చల్‌లో కుమారుడితో ఉంటున్నారు. కారు డ్రైవర్‌గా నియమించుకొని తిరుపతిలోని కుమార్తె వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 19, 2026
కడప: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. కడప జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ కడపలో ….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 19, 2026
మదనపల్లెలో ఘటన.. సుమారు 50 మందిపై కేసు నమోదు

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని సుమారు 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు మదనపల్లె DSP మహేంద్ర బుధవారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో కుల వర్ధన్ చేతిలో ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి మద్దతుగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కులసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ఆందోళనలు చేశారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఆందోళనలు చేయడంతో కేసులు నమోదు చేశారు.
News February 19, 2026
బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.


