News December 30, 2025
పాలమూరు: సంపులో పడి 18 నెలల బాలుడి మృతి

మామిడి తోటలోని నీటి సంపులో పడి ఓ బాలుడి మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండలం మాచర్లలో చోటుచేసుకుంది. వంగూరు మండలానికి చెందిన మల్లేష్, మంజుల దంపతులు మాచర్లలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మంగళవారం పనుల నిమిత్తం తమ 18 నెలల కుమారుడు హర్షిత్‌ను తోటలోకి తీసుకెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News December 31, 2025
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
News December 31, 2025
NLG: రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్ నాటికి కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.
News December 31, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


