News April 19, 2025

పాలమూరు: సాహితీవేత్తలకు పుట్టినిల్లు ఆ గ్రామం..!

image

NGKL జిల్లా వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం ఉద్యమకారులు, అభ్యుదయ సాహితీవేత్తలకు పుట్టినిల్లు. 1956లో కల్వకుర్తి ప్రాంతం నుంచి వెలువడిన గడ్డిపూలు కథ సంపుటిలో కథలు రాసిన ఏడుగురు రచయితల్లో ఇద్దరు రచయితలు కోట్ల సంపత్ రావు, కోట్ల చలపతిరావు ఈ గ్రామానికి చెందిన వారే. సంపత్‌రావు 1975 ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ ఖైదీగా దాశరథి కృష్ణమాచార్య, మాకినేని బసవవున్నయ్యతో కలిసి 16నెలలు రాజమండ్రిలో జైలులో ఉన్నారు.

Similar News

News December 15, 2025

చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.

News December 15, 2025

డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

image

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం

News December 15, 2025

మెస్సీ.. ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదే!

image

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ గురించే ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. 3 రోజుల భారత పర్యటనలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన ఎడమ కాలుకు రూ.8వేల కోట్ల విలువ చేసే ఇన్సూరెన్స్ ఉంది. అయితే దేశం తరఫున, ఫ్రాంచైజీ లీగ్ మ్యాచుల్లో ఆడే సమయంలో కాలికి ఏమైనా జరిగితేనే ఇది వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచులకు ఇది చెల్లుబాటు కాదు. దీంతో ఆయన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో ఆడట్లేదని సమాచారం.