News April 10, 2025

పాలమూరు: 4 రోజులు.. ప్రకృతి అందాలు చూసొద్దాం..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి సళేశ్వరం లింగమయ్య జాతరను ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జాతరకు ముందే లక్షలాది మంది ప్రజలు తరలివెళ్తున్నారు. కాగా నాలుగు రోజులు సా.6గంటల వరకే అనుమతి ఉంటుందని, ఈ టైమింగ్స్‌ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి సహకరించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ గుడిని ఏటా ఒకసారి మాత్రమే చూసేందుకు అవకాశం లభించడంతో ప్రజలు పోటెత్తారు.  

Similar News

News November 14, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

News November 14, 2025

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

image

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.