News January 5, 2026
పాలమూరు: BRS మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను మంగళవారం ఉదయం 9:00 గంటలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల ప్రాజెక్టు, ఎడుమ, కుడి కాలువలను పరిశీలించనున్నారు. అనంతరం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా సందర్శించనున్నారు.
Similar News
News February 7, 2026
MBNR: సౌత్ జోన్.. ఈనెల 10న చెస్ ఎంపికలు

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనాఫైడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.
News February 7, 2026
బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత: ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల నిల్వ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ యార్డు వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు.
News February 7, 2026
పాలమూరులో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండలం ఉడిత్యాల, మిడ్జిల్ మండలం దోనూరు గ్రామాల్లో అత్యంత కనిష్ఠంగా 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 14.2, జడ్చర్లలో 14.6 డిగ్రీలుగా ఉంది. రాత్రి వేళల్లో చలి గాలులు తీవ్రమవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


