News January 5, 2025
పాలవలసలో మొదలైన సంక్రాంతి సందడి
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.
Similar News
News January 7, 2025
శ్రీకాకుళం: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్
సంక్రాంతి నేపథ్యంలో శ్రీకాకుళం రోడ్డు (ఆముదాలవలసకు) రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 7,8,9,10,12,13, 14,15 తేదీల్లో చర్లపల్లి, కాచిగూడ నుంచి శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ఈమేరకు సంక్రాంతి పండుగకు జిల్లాకు రానున్న ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులు టిక్కెట్లు బుక్కింగ్ కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
News January 7, 2025
సంతబొమ్మాళి: ఉరేసుకొని పోర్టు కార్మికుడి మృతి
సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
News January 6, 2025
SKLM: వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టండి
వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టి రెవెన్యూ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా మైనార్టీ అధికారి మెంబర్ అండ్ కన్వీనర్ ఆర్ ఎస్ జాన్ సమక్షంలో జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాక్ఫ్ ఆస్తులను ఏడీ సర్వే ద్వారా సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.