News January 14, 2026

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

image

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News

News February 12, 2026

ఇవాళ దేశవ్యాప్తంగా బంద్

image

కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్‌లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్లు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

News February 12, 2026

రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ<<>> జిల్లాకోర్టుల్లో 859 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, టెన్త్, ఏడో తరగతి అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైప్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: tshc.gov.in

News February 12, 2026

ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

image

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.