News August 10, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

image

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News September 14, 2025

నల్గొండ: లోక్ అదాలత్‌లో 13,814 కేసుల పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లాలో 13,814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్‌ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ. 54,08,392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

image

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

News September 14, 2025

రేపు MGU 4వ స్నాతకోత్సవం

image

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు PHD పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 150 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ లభించాయి.