News April 24, 2025
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 10 సెంటర్లు: డీఆర్‌వో

పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో డీఆర్‌వో పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 18 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 24, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.
News April 24, 2025
బాలిక మిస్సింగ్ కేసు చేధించిన భీమవరం పోలీసులు

భీమవరం టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో 14 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో చేధించారు. సీఐ కాళీ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక విశాఖపట్నం ట్రైన్ లో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులకు సమాచారం అందించగా బాలికను గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
News April 23, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.