News February 23, 2026

పాలు, నూనెల నమూనాల రిపోర్టు వెంటనే ఇవ్వాలి: సత్యకుమార్

image

AP: రాజమండ్రిలో సేకరించిన పాలు, నూనెల పరీక్ష పూర్తిచేసి వెంటనే నివేదిక అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కల్తీపాలతో మరణాల నేపథ్యంలో వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా ఆ నమూనాలతో పాటు బాధితుల రక్తనమూనాలను కూడా ల్యాబ్‌లకు పంపామని అధికారులు తెలిపారు. నివేదిక వస్తే పాలలో రసాయనాల కల్తీ నిర్ధారణ అవుతుందన్నారు.

Similar News

News March 2, 2026

రైల్వేలో 22,195 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వేలో 22,195 గ్రూప్ డీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News March 2, 2026

రేపే చంద్రగ్రహణం.. ఏ టైమ్‌కు మొదలవుతుందంటే?

image

రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుంది. అయితే భారత్‌లో సాయంత్రం గం.6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇక మళ్లీ భారత్‌లో 2028 డిసెంబరు 31న సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు.

News March 2, 2026

దాడులు కొనసాగిస్తూనే చర్చలకు సిద్ధమంటున్న ట్రంప్

image

ఇరాన్‌పై దాడులు మరో నాలుగు వారాలు కొనసాగొచ్చని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ పెద్ద దేశం కావడంతో తమ లక్ష్యాలు నెరవేరేందుకు సమయం పడుతుందన్నారు. అంతకుముందు ఇరాన్‌తో చర్చలకు సిద్ధమని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్లు చర్చలకు కోరగా అంగీకరించానని.. ఈ పని ముందే చేసి ఉండాల్సిందన్నారు. తమ దాడుల్లో తొమ్మిది యుద్ధ నౌకలను ధ్వంసం చేసి ఇరాన్ నేవీకి భారీ నష్టం కలిగించామన్నారు.